------

Muty Tel  Culnary Blog Heading


Divider Bar


PINTEREST FACEBOOK GROUP UGGANI FACEBOOK GROUP . . . MUTYALA MULTI DIMENSIONS . . . Mutyala Culinary India FACEBOOK TWITTER

English CULINARY . . . . Michelin
Telugu Culinary
Divider Bar

గోదావరి జిల్లాలు - GODAVARI ZILLAS

గోదావరి జిల్లాల్లో దాదాపు ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేక వంటకం

 ఉంటుంది. వాటికి ఆదరణ చెక్కు చెదరదు. 


ఆత్రేయపురం పూతరేకులు; 

కాకినాడ, తాపేశ్వరం కాజాలు; 

పెద్దాపురం కోవా, చెక్కవడ; 

భీమవరం నాన్‌వెజ్‌ పచ్చళ్లూ, 

అంబాజీపేట పొట్టిక్కలు, 

అమలాపురం సోంపాపిడి, 

గొల్లల మామిడాడ ఇమిర్తి, 

పెరుమళ్లాపురం పాకం గారెలు, 

పాలకొల్లు దిబ్బరొట్టెలు, 

పెరవలి పచ్చళ్లు, 

పెనుగొండ కజ్జికాయలు

 ... ప్రసిద్ధి. ఇవి జిల్లాలోనే కాదు; ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో ఉన్న గోదావరి వాసులను కూడా నోరూరిస్తూ ఉంటాయి.


కాజా తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరం లో తయారయ్యే తాపేశ్వరం కాజా ప్రపంచ ప్రసిద్ధి చెందినది. అంతే కాదు కాకినాడ ప్రాంతము కాజాల ద్వారానే బహు ప్రసిద్ది. కాజాలు ఆంధ్ర ప్రాంతంలో అత్యదికంగా విక్రయించబడే మిఠాయిలు మరియు శుభకార్యక్రమములలో విరివిగా వినియోగించబడే ప్రసిద్ద మిఠాయి.


గోదావరి జిల్లాలు - పూతరేకులు పూతరేకులు ఆంధ్రప్రాంత అత్యంత ప్రసిద్ద మిఠాయిలు. పూతరేకులు చేయుట అనేది కేవలం తూర్పు గోదావరి జిల్లా లోని కొన్ని ప్రాంతాలకే పరిమితం. తూర్పుగోదావరిలోని ఆత్రేయపురం మండలం గురించి మరేవిదంగా తెలియక పోయినా పూతరేకుల పరంగా ఈ మండలం బహు ప్రసిద్దం. ఈ మండల పరిధిలోని గ్రామాలు పూతరేకుల తయారీతో కళ కళలాడుతుంటాయి


కాకినాడ లో రుచికరమైన ప్రసిద్ధ ఆహారములు , ఆహార శాలలు

Kakinada Famous Foods & Food Courts & Street Foods

========================





శ్రీ కృష్ణా విలాస్ - సుబ్బయ్యగారి హోటలు




ఎక్కడివో ఎప్పుడివో ఎందుకు రోజు మన జీవితంలో రోజు జరిగేవి చూస్తే చాలు.

శ్రీ కృష్ణా విలాస్ అంటే తెలీకపోవచ్చు గాని సుబ్బయ్యగారి హోటలంటే ఎవర్నడిగినా చెప్తారు కాకినాడలో అని..

ఏదైనా పనుండి కాకినాడొచ్చినోళ్ళు ఎవరైనా సరే ఓ సారి సుబ్బయ్య హొటేలుకెళ్ళి భోజనం చేయాలనుకుంటారు.. మనం ఒద్దు ఒద్దంటున్నా వినకుండా బలవంతం చేసి మరీ ఆకునిండా మొత్తం ఇరవై అయిదు రకాల ఐటెంసేసి పెట్టే సుబ్బయ్య హొటేలు భోజనం అంటే అంత ఫేమస్సు మరి.. ఎన్టీ రామారావుగారైతే అప్పట్లో తూగోజీ ఎప్పుడొచ్చినా ఇక్కడ భోజనం చెయ్యకుండా వెళ్ళీవోరు కాదని ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు..

1940 లో కట్టిన పాతకాలం బిల్డింగులోకి అడుగెట్టగానే ఎక్కడికక్కడ కిటకిటలాడిపోయే జనాన్ని చూసి అది హోటలో లేక సత్రమో అర్ధంగాదు మనకి చాలాసేపు.. జనాన్ని చూసి కంగారు పడకండి.. రష్ ఎంతుంటాదో వడ్డింపు అంత స్పీడుగా ఉంటాది.. వడ్డన కుర్రోళ్ళు పిచ్చెక్కిస్తారు.

ఎంట్రన్సులో ఉన్న కౌంటర్లో టేబుల్ మీదెట్టిన నేతిబూరెలు, పాకంగారెలు, పులిహోరపొట్లాలు చూడగానే నోట్లో నీళ్లూరతాయ్.. ధైర్యం తెచ్చుకుని డైనింగ్ సెక్షనులోకి అడుగెడతాం...

ఎళ్ళగానే పెద్ద సర్వరెదురొచ్చి చుట్టానికి మర్యాద చేసినట్టు చేసి, కూర్చోబెట్టి ఆకేసి మిగతావోళ్ళని కేకేస్తాడు "రేయ్.. రాండ్రా" అని..

అంతే..

రైల్వే గేట్ దాటుతున్న గూడ్సుబండి బోగీల్లాగా ఎంతకీ తరగని ఐటమ్స్ అన్నీ సర్వర్ కుర్రోళ్ళ చేతుల్లోంచి ఒకదానెనకాల ఒకటి వస్తానే ఉంటాయి..

అన్నిటికంటే ముందు మజ్జిగావడలో బూందీ పలుకులు చల్లి మీ ముందెడతారు.. మీరు చేతిలోకందుకుని దాంతో మొదలెడతారు.. కళ్ళు మూసుకుని తింటా ఉండగానే పులిహోర, ఫ్రైడ్రైసు, చపాతీ ఒకదానెనకాలొకటి రెండు రకాల కూరలు, చట్నీలు, పచ్చళ్ళతో సహా మీ అరిటాకు ప్లేటులో ప్రత్యక్షమైపోతాయ్..

ఏ మాటకామాట.. ఎప్పుడు పడ్డాయో కూడా తెలీకుండా ఆ కుర్రోళ్ళు ఆకులోకి యేసే స్పీడ్ జూత్తే ముచ్చటేస్తాది..

"అబ్బే నేను పులిహోర కలుపుతాను తప్ప తినను, ఫ్రైడ్ రైస్ నాకు పడదు" అని మనమంటే ఆళ్ళు వినరు.. "బోంటాది సార్ తినండి" అని ఇంటికొచ్చిన చుట్టాన్ని బలవంతం జేసినట్టు జేత్తారు.. మనం కూడా ఐసైపోయి అలాగే తింటాం.. బాగానే ఉందనుకుని అప్పటికే ముప్పాతిక ఫుల్లయిపోయిన పొట్ట తడుముకుంటాం.. ఓపక్క కుడిచేత్తో తింటుంటాం ఇంకోపక్క ఎడంచేత్తో వొద్దు.. వొద్దు.. చాలు.. చాలు.. అని చెయ్యూపుతానే ఉంటాం.. ఈ హోటల్లో తినేవాళ్ళకి రెండు చేతులకి పనే అని అప్పుడర్ధమవ్వుద్ది..

ఆగండాగండి.. అది ట్రైలరంతే.. ఇప్పుడసలు సినిమా స్టార్టవ్వుద్ది..

పొగలు కక్కుతున్న తెల్లన్నాన్ని బేసిన్లతో పట్టుకొచ్చిన పెద్ద సర్వరు స్టార్ హోటళ్లలో హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్లాగా వయ్యారంగా చేతులు విదల్చకుండా, స్టీలు హస్తంతో తీసి ఒకే ఊపుతో హస్తంతో సహా అన్నాన్ని మొత్తాన్ని ఆకులోకి ఒంపుతాడు.. అదీ పద్దతంటే..పెట్టే మనసేంటో అక్కడ తెలుస్తాది.. 👌

"కరేపాకు పొడి సార్, కందిపొడి సార్, నెయ్యి సార్, ఇది దోసవకాయ టేస్ట్ చెయ్యండి.." అని పేరుతో సహా చెప్పి మరీ ఆప్యాయంగా వడ్డింతారు అన్నంలోకి పొడులు, పచ్చళ్ళు.. "ఇది బీట్రూట్ పచ్చడి.. ఆరోగ్యం" అని సలహాలిచ్చి ఒక చెమ్చాడు ఆకులో ఏసిగాని ముందుకి కదలడు ఇంకో ఎర్రరంగు బనేలు కుర్రోడు..

క్యారెట్-కొబ్బరి, దొండకాయ ఫ్రైల్లో ఏది కలుపుకోవాలో తెలీక మామిడికాయ పప్పు మీదకి మనసు లాగుతుంటే స్టక్కయిపోతాం మనం.. ఈలోగా గుళ్లో ఉండే దేవుడి విగ్రహాల్ని చేతి వెళ్ళకే ఉంగరాలుగా పెట్టుకున్న ఓ నల్లటి పెద్దమనిషి మనదగ్గరికొచ్చి "ఇది ఈరోజు స్పెషల్ ఐటమ్ సార్.." అన్జెప్పి మసాలా కూరి, జీడిపప్పు చల్లిన గుత్తివంకాయని ఆకు చివర్న నింపాదిగా పెడతాడు.. ఆ పెద్దమనిషే ఆ హోటలు ఓనరని మనకి అర్ధమయ్యిలోపులోనే ఆ గుత్తివంకాయ మన నోట్లో కమ్మగా కరిగిపోయి, అరిగిపోద్ది.. ఆటోమేటిగ్గా, మన సిస్టం కూడా హెవీ అయిపోద్ది... అలాగని ఏదీ వొదిలెయ్యడానికి మనసొప్పదు.. దేని రుచి దానిదే అన్నట్టు పోటీ పడతుంటాయ్..

రైస్ సార్ అని మరోసారి బేసిన్తో రెడీ అయిపోతాడు ఇందాకటి కుర్రోడు..