వివిధ ప్రాంతాల్లో వంట - విధానాలు - RANDOM AREAS RECIPES
ఆహా ఏమి రుచి అనరా మైమరచి .. ఎక్కడికైనా టూర్‌కు వెళుతుంటే.. మనం ముందుగా అడిగే మాట..అక్కడ స్పెషల్ ఏమిటని..ఎందుకంటే ఎవరైనా సరే అక్కడ స్పెషల్ రుచి చూడాలి..నలుగురికి చెప్పాలి... అటువంటి స్పెషల్స్ ఎన్నో...ఎన్నెన్నో..వాటి గురించి తెలుసుకుంటాం.. ఒకసారైనా రుచి చూడాలని అనుకుంటాం..అటువంటి వాటిలో చాలా ఉంటాయి..తాపేశ్వరం కాజా,, ఆత్రేయపురం పూతరేకులు,తాటితాండ్ర, కాకినాడ కాజా, బెల్లం పాకం గారెలు, మాడుగుల హల్వా, బందరు లడ్డూ, రాయలసీమ ఉగ్గాణి, రాజమండ్రి సోంపాపిడి ఇలా చెప్పుకుంటూ పోతే ఆ రుచులెన్నో..ఒకసారి వింటే తిన్న వారికి మళ్లీ మళ్లీ నోరూరుతుంది.. అదే విన్నవారికైతే ఎప్పుడెప్పుడు తిందామా అని అనిపిస్తుంది..ఆ రుచులన్నీ ఒక చోట చేరితే.. ఇంకేముంది.. నోరూరుకుంటుందా.. మనసు ఆగుతుందా...రుచి చూడాల్సిందే..ఆ మజా అనుభవించాల్సిందే.. కడుపునిండా ఆరగించాల్సిందే.. ఒక జ్ఞాపకంగా మిగుల్చుకోవాల్సిందే.. ప్రపంచంలో మనిషి ఎక్కడున్నా, ఏమి చేసినా- తిండి తినాల్సిందే! రకరకాల పనుల మధ్య తలమునకలయ్యే మనకు ఆహారం కేవలం జీవించటానికే కాదు; ఆహ్లాదరకంగా ఆస్వాదించటానికి కూడా! ఏదొకటి తిని పొట్ట నింపుకోవటం కాదు; నాలుక నలభై విధాలుగా అలరారాలి. ఆనందించాలి. అందుకే అనేక రుచులూ, అనేకనేక వంటకాలూ. తిండి అన్నిచోట్లా ఉంటుంది. అది ఒక్కోచోట ఒక్కో స్థానికతను అద్దుకొని మనల్ని అలరిస్తుంది. మరి మనచుట్టూ ఉన్న మనవైన ప్రత్యేక వంటకాలు ఏంటో, వాటి ప్రత్యేకతలు ఏమిటో ఓసారి చవిచూద్దామా?
ఆంధ్రా అంటేనే భోజన ప్రియులకు కేరాఫ్. అలాంటి రాష్ట్రంలో రుచికరమైన పదార్థాల గురించి ఎంత చెప్పినా తక్కువే! రాష్ట్రంలోని చాలా ఊళ్ళు ప్రత్యేక రుచులకు ట్యాగ్‌లైన్‌లుగా మారిపోయాయి. కొన్ని వంటకాలు గ్రామాలు, పట్టణాలు, రాష్ట్రాలను దాటి, అంతర్జాతీయ స్థాయి కీర్తినీ గడించేశాయి.
ఇలా ఒక్కో ఊరు ఒక్కో బ్రాండు. తిరుగులేని రుచికి తిరుగులేని అడ్రస్సు.
కృష్ణా జిల్ల్ల్లా
కృష్ణా జిల్ల్ల్లాలో తయారయ్యే పచ్చళ్ళు, రకరకాల నాన్‌వెజ్ వంటకాలు, పులిహోర, చక్రపొంగలి లాంటి పసందైన వంటకాలే కాదు;
బందరు లడ్డూ
ఇక్కడి బందరు లడ్డూ కూడా చాలా ఫేమస్. బందరు లడ్డూ తయారీ ఓ ప్రత్యేకం. ..ఎన్నో రకాల లడ్డూలున్నా బందరు లడ్డు ప్రత్యేకత వేరు. అసలు పంచదార లేకుండా బెల్లంతోనే తయారుచేస్తారు. తినడానికి చాలా రుచిగా ఉంటుంది.ఈ లడ్డూకి పూర్వం నుంచి మంచి పేరు ఉంది. కొన్ని వందల ఏళ్ళ కిందట బుందేల్‌ఖండ్ ప్రాంతం నుంచి బందరు వలస వచ్చిన బొందిలీలు అనబడే రాజపుత్రులు లడ్డూని పరిచయం చేశారు... శనగపప్పు, బెల్లం లేదా పంచదార రోటిలో వేసి దంచుతారు. దంచేటప్పుడు అందులో కావాల్సిన స్వచ్ఛమైన నెయ్యి, యాలకులు వంటివి కలుపుతారు. శనగపిండితో పూస తీసి ఆ పూసను పొడి చేసి దానికి బెల్లం పాకం కలిపి మళ్లీ దానిని రోకలితో తొక్కి తయారు చేస్తారు. అందుకే దీనిని తొక్కుడులడ్డూ అని కూడా అంటారు. బందరు బెల్లం హల్వా కూడా అందుబాటులో ఉంది.
ఈ లడ్డూల తయారీలో శిర్విశెట్టి సత్యనారాయణ (తాతారావు) స్వీట్స్, మల్లయ్య స్వీట్స్ చాలా ప్రసిద్ధి. ప్రముఖ సినీనటులు నందమూరి తారక రామారావు మచిలీపట్నం తాతారావు స్వీట్ షాపులో బందరు లడ్డూతో పాటు హల్వాను కొనుగోలు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
నూజివీడు
ఈ ఊళ్లోనే రసాలు, బంగినపల్లి, ముంత మామిడి, తోతాపురి లాంటి మామిడి రకాలతోపాటు హిమాయతీ రకం మామిడి చాలా ప్రత్యేకం. నూజివీడు పేరు ప్రపంచ దేశాల్లో వ్యాపించడానికి ఈ మామిడి రకాలే కారణమని చెప్పొచ్చు. ఇక్కడి ఆవకాయ (మామిడికాయ) పచ్చడికి అంతర్జాతీయ గుర్తింపూ ఉంది.
నోరూరు.. ఉలవచారు
పచ్చడి, కూర తర్వాత ఇక్కడి వారు ఎక్కువగా చారుతో అన్నాన్ని తింటుంటారు. ఒకప్పుడు ఇక్కడ ఇంగువ చారుకు చాలా ఫేమస్. అయితే ఇంగువచారును పక్కకునెట్టి రుచితో దానికి పోటీగా నిలిచిన వంటకం ఉలవచారు. మొదట ఈ పదార్థం గురించి విన్నవారంతా ఆశ్చర్యపోయారట. అలా ఆశ్చర్యపోడానికి ఒక కారణముంది. ఎందుకంటే ఉలవల్ని ఉడికించి గుర్రాలు, పశువులకు దాణాగా వేసేవారు. ఆ క్రమంలో ఉలవల్ని ఎక్కువసేపు ఉడికించిన తర్వాత ఆ నీటితో చారు కాచుకునేవారట కొందరు. అలా ఈ ఉలవచారు ఒకప్పుడు సామాన్యుల భోజనంలో ఓ భాగం అయింది. ఆ తర్వాత ఈ ఉలవచారు రుచిని కనిపెట్టిన హోటళ్ళు, రెస్టారెంట్లు ఇదో స్పెషల్ మెనూగా మార్చి కస్టమర్లను ఆకట్టుకోవటం మొదలెట్టాయి. వివాహ భోజనాల్లో కూడా ఇప్పుడు ఉలవచారు ప్రత్యేక స్థానం పొందుతోంది. కృష్ణా, గుంటూరు, నెల్లూరు ఉలవచారు రుచి ఫేమస్ అయ్యింది.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకప్పుడు ఉలవకట్టు ప్రసిద్ధి.
వంటగాళ్ల ఊరు... ఇందుపల్లి
కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఇందుపల్లి గ్రామానికి చెందిన కొందరు వంటగాళ్ళు భలే భలే వంటకాలు చేస్తారు. లక్షమందికి సైతం క్షణాల్లో వండివార్చగల నలభీములు ఉన్నారు ఈ ఊళ్లో. ఈ గ్రామంలోనే సుమారు 1000 మంది వరకూ వంట మేస్త్రులు ఉన్నారని అంచనా.
గోంగూర, నత్తముక్కలు
కారంలో గుంటూరు మిర్చికి పోటీలేదు. అలాంటి ఘాటైన మిర్చితో తయరుచేసే గోంగూర పచ్చడితోపాటు నత్తలతో చేసే నత్తముక్కల కూర ఇక్కడ ఎంతో ప్రాచుర్యం పొందింది. తీరప్రాంతాల్లో లభించే నత్తల్ని తెచ్చి శుభ్రం చేసి వాటితో కూరను వండుతారు.
గోదావారి జిల్లాలు
తూర్పు గోదావరి జిల్లా
తీపి పాకాలు
గోదావారి జిల్లాలనగానే మనకు పచ్చని పంటలు, కొబ్బరి తోటలు గుర్తొచ్చేస్తాయి. ఇక ఇక్కడ తయారుచేసే చేపల వంటకాలు, తీపిరుచులకు మంచి పేరు ఉండనే ఉంది.
కాకినాడ
సుబ్బయ్య హోటల్
కాకినాడలో సుబ్బయ్య హోటల్ అంటే బాగా ఫేమస్. ఈ హోటల్‌ను నెల్లూరుకు చెందిన గునుపూడి సుబ్బారావు కాకినాడ వచ్చి ఒక అద్దె ఇంట్లో ప్రారంభించారు. ఈ హోటల్లో ఇప్పటికీ అరిటాకులోనే కొసరికొసరి వడ్డిస్తారు. ఒక స్వీట్, పులిహోర, వెజ్ బిర్యానీ, రైస్, నాలుగు రకాల కూరలు, డీప్ ఫ్రైలు, పచ్చళ్లు, పొడులు, సాంబారు, రసం, ఆఖరికి మజ్జిగ పులుసు, గారెలు, పెరుగు వడలు.. ఇలా 40 రకాల వరకూ వడ్డిస్తూనే ఉంటారు.
కాకినాడ
కాజా
కాకినాడ కాజాకు బాగా పేరు. వీటిని తొలుత కోటయ్య అనే ఆయన తయారు చేశారు. గుండ్రని ట్యూబ్ ఆకారంలో ఉండటం వల్ల దీనిని గొట్టం కాజా అంటారు. మైదా పిండితో చేసే ఈ కాజా లోపలి భాగం స్పాంజిలా పొరల్లా ఉండి అందులో చక్కెర పాకం నిలువ ఉంటుంది.
అంబాజీపేట
పొట్టిక్కలు
వీటినే పనస బుట్టలు, పనస పొట్టిక్కలు అని కూడా అంటారు. కోనసీమలోని అంబాజీపేట ఈ వంటకానికి ప్రసిద్ధి. లేత పనసాకులని బుట్టల్లా కుట్టి అందులో ఇడ్లీలు తయారు చేస్తారు అలా వీటికి పనస బుట్టలనే పేరొచ్చింది. కోనసీమలో చాలా ప్రాంతాల్లో వీటిని తయారుచేసినా అంబాజీపేట పొట్టిక్కలు భలే రుచిగా ఉంటాయి. శుభ్రం చేసిన పనసాకులను పచ్చి కొబ్బరి పుల్లలతో గుచ్చి ఈ బుట్టలను తయారుచేస్తారు. మనం సాధారణంగా వండుకునే మినప్పప్పు, ఇడ్లీరవ్వతోనే వీటిని తయారుచేసినా పనసాకుల వల్ల మంచి వాసన, రుచి వస్తుంది. వీటికి ఉపయోగించే బుట్టలను అంబాజీపేట, పుల్లేటికుర్రు ప్రాంతాల్లో మహిళలు కుట్టడం ద్వారా ఉపాధి పొందుతున్నారు.
తాపేశ్వరం
కాజా
తాపేశ్వరం తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి నుంచి మండపేట వెళ్లే మార్గంలో ఉంది. ఈ ఊళ్లో తొలుత కాజా తయారుచేసిన ఘనత పోలిశెట్టి సత్తిరాజుది. 1930లో ఆయన తయారు చేసిన కాజా ఫార్ములాతో నేడు రాష్ట్ర మంతటా తాపేశ్వరం కాజాగా ఫేమస్ అయ్యింది. ఇందులో కృత్రిమ రంగులు గానీ, ఫ్లేవర్స్ గానీ ఉపయోగించరు.
ఆత్రేయపురం
పూతరేకులు
తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం పూతరేకులు చాలా ఫేమస్. వీటిని తయారీ ద్వారానే ఆత్రేయపురం ప్రపంచానికి సుపరిచితమయింది. పూతరేకులను కొన్ని చోట్ల పొరచుట్టలు అని కూడా పిలుస్తారు. పొరలుపొరలుగా వీటిని తయారుచేయడం ఒక కళే! పూతరేకుల తయారీకి కాల్చిన పెద్ద మట్టి కుండను వాడతారు. ఈ కుండ నున్నగా గుండ్రంగా ఉంటుంది. దాని మూతి వైపుగా కట్టెలు పెట్టేంత వెడల్పుగా కుండకు రంధ్రం చేస్తారు. మినప, వరిపిండి మిశ్రమాన్ని పల్చగా వచ్చేలా చేసుకొని ఒకరోజు పాటు నిల్వ ఉంచుతారు. మరుసటి రోజు కుండకు ఉన్న రంధ్రం ద్వారా కట్టెలు పెట్టి, మంట పెట్టి కుండను వేడెక్కిస్తారు. జాలుగా తయారు చేసిన పిండిలో పల్చని గుడ్డను ముంచి, దానిని విప్పి వెడల్పుగా కుండపై ఒకవైపు నుంచి మరొక వైపు లాగుతారు. వేడెక్కిన కుండపై పిండి పల్చని పొరలా ఒక పేపర్ మందంతో ఊడి వస్తుంది. దానిని రేకుగా పిలుస్తారు. ఈ రేకులో తీపిపదార్థాలను వేసి పొరలుపొరలుగా మడిచిపెట్టి పూతరేకులను తయారుచేస్తారు. నెయ్యి, బెల్లం వేసి చేసే సాంప్రదాయ పద్ధతి ఒకటైతే; పంచదార పొడి వేసి చేసే పద్ధతి ఇంకొకటి. జీడిపప్పు, బాదం పప్పు వేసి తయారు చేస్తుంటారు. అనేక ప్రాంతాలకు నిత్యం ఎగుమతి అవుతూనే ఉంటాయి ఈ ఊరి పూతరేకులు.
పెరుమాళ్లపురం
పాకం గారెలు
వింటే భారతం వినాలి,తింటే గారెలు తినాలి అనేది ఓ నానుడి.. గారెలు అనగానే ఉల్లిగారెలు, పెరుగులో వేసి చేసే ఆవడలు గుర్తొస్తాయి. మరి ఆ గారెలు బెల్లం పా కంతో తింటే...భలే రుచి. .పాకం గారెల గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. ఈ పాకం గారెలకు తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలంలోని పెరుమాళ్లపురం పేరు. 60 ఏళ్ళ కిందట పేరూరి అప్పాయమ్మ పెరుమాళ్ళపురంలో ఈ బెల్లం గారెలు తయారు చేసింది. .ఈ బెల్లం గారెల తయారీతో ఆ గ్రామం జీవనోపాధి పొందుతోంది.
నగరం
గరాజీలు
మామిడికుదురు మండలంలోని నగరం నుంచి గరాజీలు రాష్ట్రంలోని అన్నిచోట్లకు ఎగుమతులు అవుతాయి. బియ్యం పిండి, పంచదారతో గరాజీలు ప్రత్యేకంగా తయారుచేస్తారు. ఈ గ్రామంలో గరాజీల తయారీ ఒక కుటీర పరిశ్రమగా అభివృద్ధి చెందింది. సుమారు వంద కుటుంబాల వారు జీవనోపాధి పొందుతున్నారు.
కండ్రిగ
కోవా
ఇది ఉభయ గోదావరి జిల్లాల ఫేమస్ స్వీట్. ఊరు పేరునే కోవా పేరుగా మార్చేసుకుంది. కొత్తపేట మండల కేంద్రానికి సమీపంలోని కండ్రిగ గ్రామంలో ప్రారంభమైన వ్యాపారం నేడు ఉభయ గోదావరి జిల్లాలకు పాకింది.
పశ్చిమ గోదావరి జిల్లా
పాలకొల్లు
దిబ్బరొట్టె
ఈ దిబ్బరొట్టె రుచే వేరు..
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో దిబ్బరొట్టె ప్రసిద్ధి. ఆ ఊరెళ్లే భోజన ప్రియుల స్థానిక మారుతీ థియేటర్ వద్ద తయారు చేసే దిబ్బరొట్టెలను రుచి చూడకుండా ఉండరు. అక్కడ పెనంపై రొట్టెలను వేసిన తర్వాత పైభాగంలో రేకు పెట్టి నిప్పులు వేస్తారు. రెండువైపులా ఒకేవిధంగా రొట్టె ఉడుకుతుంది. దీంతో సరికొత్త రుచి వస్తుంది. భీమవరం నాన్‌వెజ్ పచ్చళ్లకు పెట్టింది పేరు. ఇక్కడ నిల్వపచ్చళ్లకు నోచుకోని నాన్‌వెజ్ లేదంటే లేదు. ఏదన్నా ఉంది అని ఒకమాట అని చూడండి. తెల్లారేసరికి ఆ పచ్చడి జాడీ ఒకటి సిద్ధం చేసేస్తారు భీమవరం నలభీములు.
పాలకొల్లు
సోంపాపిడి
పాలకొల్లు, ఇతర ప్రాంతాల్లో సోంపాపిడి ఎంతో ప్రసిద్ధికెక్కింది. ఈ సోంపాపిడిని పాలకొల్లు పట్టణంలోని ఐదు ప్రాంతాల్లో తయారు చేస్తున్నారు. సోం పాపిడిని చిన్నారులు ఎంతో ఇష్టంగా తింటారు. ధర కూడా సామాన్యులకు అందుబాటులో ఉంటుంది. పాలకొల్లు నుంచి సోం పాపిడిని ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకూ ఎగుమతి చేస్తుంటారు.
రాయలసీమ
రాయలసీమ రుచులు
.రాయలసీమ ఆహారంలో ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఆ ప్రాంత వాసులు ఉదయం ఉగ్గాణి, బజ్జీ అల్పాహారంగా తీసుకుంటారు. మరమరాలను పులిహోర మాదిరిగా తాళింపు వేసిందే ఉగ్గాణి. ఇక దానికి తోడు మిరపకాయబజ్జీ ఉంటుంది. దీంతో పాటు జొన్నలతో చేసే జొన్న రెట్టే, రాగులతో చేసే రాగి రొట్టె, సజ్జలతో చేసే సజ్జ రొట్టెలు విక్రయిస్తున్నారు. వీటిలోకి నూనె వంకాయ (గుత్తి వంకాయ) కూర ఇస్తారు.అంతే కాకుండా రాగి సంగటి, కొర్ర పెరుగన్నం, ఓళిక (బొబ్బట్టు)లు,
రాయలసీమలో రాగులు, జొన్నలతో చేసే పదార్థాల్లో రాగి ముద్ద, రాగిసంకటి, జొన్న రొట్టెలు చాలా ఫేమస్. కడప, కర్నూలు, అనంత పురం జిల్లాల్లో అన్నంతో రకరకాల పదార్థాలను తయారుచేస్తారు. ఇక్కడ పులిహోరను చిత్రాన్నంగా పిలుస్తారు. చింతపండు పులుసుని ఉపయోగించి తయారుచేసే చిత్రాన్నం చిత్తూరులో పులుపన్నంగా పేరు. ఇక్కడ ఉగ్గాణీలు, కోవా కూడా ఫేమస్సే. వీటి తయారీలో పేరొందిన ఆ గ్రామాలివే.
కడప
గువ్వలచెరువు
పాలకోవా
కడపకు 25 కిలోమీటర్ల దూరంలో గువ్వలచెరువు ఉంది. ఆ ఊరి పేరు చెబితే గుర్తుకు వచ్చేది పాలకోవా. ఇక్కడ తయారుచేసే పాలకోవాకు జిల్లాలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో సైతం గుర్తింపు ఉంది. లండన్, అమెరికా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలు కువైట్, సౌదీ అరేబియా, ఖత్తర్, దుబాయి దేశాలకు ఎగుమతి కూడా అవుతోంది. కడప జిల్లా రామాపురం మండలంలోని బండపల్లె, హసనాపురం, సరస్వతీపల్లె, గోపగుడిపల్లె, కసిరెడ్డిగారిపల్లె, రాచపల్లె, పంచాయతీల నుంచే కాక చింతకొమ్మదిన్నె, లక్కిరెడ్డిపల్లె; చిత్తూరు జిల్లాలోని కలకడ పరిసర ప్రాంతాల్లో కోవాకు అవసరమైన పాలను సేకరించి వీటిని తయారుచేస్తారు.
కర్నూలు జిల్లా
ఉగ్గాని బజ్జీ
కర్నూలు జిల్లాలో అల్పాహారంగా తీసుకునే ఉగ్గాని బజ్జీ రుచే వేరు. ఉగ్గాని భజ్జీ తయారీ సులభతరంగా ఉండడంతో గ్రామీణ ప్రాంతాల్లో పెళ్లిళ్లకు ఎక్కువగా దీన్ని అల్పాహారంగా పెడతారు. చూసేందుకు ఇది బిర్యాని తరహాలోనే ఉంటుంది. కానీ, దాని తయారీ వేరు. బొరుగులు (మరమరాలు), పచ్చి మిరపకాయలు, నిమ్మకాయ లేదా చింతపండు రసం, ఉల్లిపాయలు, టమోట, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, పప్పుల పొడిని ఉపయోగించి ఉగ్గానిని తయారుచేస్తారు. దీన్ని మిరపకాయ బజ్జీతో కలిపి తింటే ఆ రుచే వేరు.
ఉత్తరాంధ్ర
ఉత్తరాంధ్ర ఊరింపులు
ఉత్తరాంధ్రగా పిలిచే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వంటల్లో ఎక్కువగా తీపి ప్రసిద్ధి. ఇక్కడ బెల్లం ఆవకాయ, ఆవపెట్టిచేసే పనసపొట్టు కూర బాగా పేరు. స్వీట్లలో మాడుగుల హల్వా, మందస కోవా చాలా ఫేమస్
విశాఖ జిల్లా
మాడుగుల హల్వా
హల్వా అనగానే నోరూరుతుందా.. మరి అది మాడుగులదైతే... మన ముంగిట్లో దొరికితే ఇంకేముంది.. పదండి రుచి చూసేద్దాం. విశాఖ జిల్లా మాడుగుల హల్వాకు పెట్టింది పేరు.
హల్వా... ఈ పేరు వింటే టక్కున గుర్తుకొచ్చేది విశాఖ జిల్లా మాడుగుల. హల్వా అంటే మాడుగుల, మాడుగుల అంటే హల్వాగా కీర్తి పొందింది. వివిధ పదార్థాలతో వివిధ హల్వాలు తయారవుతున్నా, గోధుమలతో తయారయ్యే ఈ హల్వా ఒక్క మాడుగులకే సొంతం. మాడుగులలో దంగేటి ధర్మారావు ద్వారా ఈ హల్వా తయారీ వందేళ్ల క్రితమే ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ గ్రామంలో 16 మంది మాత్రమే తయారీ దారులు ఉన్నారు. ఈ హల్వా తయారీ చాలా కష్టంతోనూ, ఓపికతోనూ కూడుకున్న పని.
దీనిని గోధుమ పాలతో తయారు చేయడం ప్రత్యేకత. గోధుమలను 3 రోజులు నానబెట్టి వాటి నుంచి పాలు తీసి, ఆ పాలు 3 రోజులు నిల్వ చేసి వాటికి ఆవు నెయ్యి, పంచదార, జీడిపప్పు కలిపి తయారు చేస్తారు.
శ్రీకాకుళం జిల్లా
మందస
కోవా
పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఇష్టపడేది పాలకోవా. ఇది చాలాచోట్ల లభిస్తున్నా శ్రీకాకుళం జిల్లా మందస కోవా మరో ప్రత్యేకం. సాధారణంగా కోవా అంటే బిళ్లల్లాంటివే గుర్తుకొస్తాయి. మందస కోవా ఇందుకు ప్రత్యేకం. బిల్లల రూపంలోనే కాదు, ద్రవరూపంలోనూ ఇక్కడ లభిస్తుంది. ఇక రుచి విషయానికొస్తే లొట్టలేసుకొని మరీ తినాల్సిందే!
విజయనగరం జిల్లా
భీమాళి
తాండ్ర
చూడగానే నోరూరించే మామిడి తాండ్రకు విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలంలోని భీమాళి, గనివాడ గ్రామాలు ప్రసిద్ధి. తీయ తీయగా, పుల్లపుల్లగా నోరూరించే మామిడి తాండ్రను దుబారు వంటి దేశాలకు ఏటా ఎగుమతి చేస్తుంటారు. తాండ్ర తయారీపై ఆధారపడి గ్రామంలోని సుమారు 300 కుటుంబాలు జీవిస్తున్నాయి. ఒక్కొక్క కుటుంబం ఏటా సుమారు మూడు వేల కిలోల తాండ్రను తయారు చేస్తుంది.
నెల్లూరు
నెల్లూరు కారందోసె రుచి నషాళానికి అంటుతుంది.
నెల్లూరు
చేపల పులుసు
ఇక ఇక్కడి చేపల వంటకాలకు మంచి పేరు ఉంది. చేపల పులుసు తయారీలో నెల్లూరు చాలా ఫేమస్. రంగు, రుచితో నోరూరించే ఈ చేపల పులుసు అంతగా ప్రాచుర్యం పొందడానికి దాని తయారీయే కారణం. ఈ చేపల పులుసులో మామిడి కాయ, చింతపండును ఉపయోగిస్తారు. చింతపండుకంటే మామిడికాయల గుజ్జును ఎక్కువగా వినియోగించి చేసే ఈ పులుసు చక్కని సరికొత్త రుచిని అద్దుకుంటుంది.
చీరాల
స్వీట్ సమోసా రుచి .. సంస్కృతి
సమోసా అంటే కారం కారంగా తినే రకరకాల సమోసాలు గుర్తుకొస్తాయి. మరి మీరెప్పడైనా తీపి సమోసాలను తిన్నారా? ఇలాంటి తీపి సమోసాలకు ప్రకాశం జిల్లాలోని చీరాల చాలా ఫేమస్. వీటినే మున్నీర్ భారు మీటా సమోసా అని కూడా పిలుస్తారు. ఎందుకంటే వీటి తయారీని కనిపెట్టింది ఆయనే. మొదట ఈయన ఒక పండ్ల వ్యాపారి. అది లాభసాటిగా లేకపోవడంతో వివిధ రకాల వంటలపై ప్రయోగం మొదలు పెట్టాడు. ఆ ప్రయోగం నుంచి వచ్చిందే ఈ తీపి సమోసా. జీడిపప్పులు వేసి తయారుచేసే ఈ సమోసా తయారీ విధానం మాత్రం మున్నీర్ భారుకు తప్ప ఇంకెవరికీ తెలీదు. ఏడు పదుల వయసులోనూ ఇంకా ఈ వృత్తిలోనే కొనసాగుతున్నా ఆయన వంటకం మాత్రం ఇతర దేశాలకు చేరుతోంది.
ప్రకాశం
ఒంగోలు
ప్రకాశం జిల్లాని ఒంగోలులో అల్లూరయ్య స్వీట్స్‌కు చాలా పేరుంది. తిరుపతి, ఒంగోలులో ఎగ్‌దోశ చాలా ఫేమస్. వివిధ జిల్లాల్లోని అనేక ప్రత్యేక వంటకాల గురించి తెలుసుకున్నాక మీకూ వాటిని రుచిచూడాలని పిస్తోంది కదా? మీరూ ఆయా ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి వంటకాలనూ చవి చూడండి మరి!
వంటలు ఏవన్నా .. వట్టి వంటలు కావు. పట్టిచూస్తే అవి ఆ ప్రాంతపు సాంస్క ృతిక, చారిత్రిక విశేషాలు కూడా! ఒక్కో ఊళ్లో ఒక్కో రుచి అమోఘంగా అలరించటం ద్వారా పేరొస్తోంది. ఆ పేరేదో.. టీవీల్లోనో, పత్రికల్లోనూ యాడ్‌లిచ్చి కెఎఫ్‌సి లెవల్లో రాత్రికి రాత్రి వచ్చింది కాదు. నాలుక మీద అలరారిన రుచి గుండెల్లోకి దిగి... మనసును గెలుచుకొని.. నాలుక ద్వారానే నలుగురికీ పాకుతుంది. నియమనిబద్ధంగా నాణ్యమైన పదార్థాలు వాడటం, తగుపాళ్లను రంగరించటం, రుచినీ శుచినీ నమ్మకంగా అందించటం, లాభాల కన్నా కూడా నమ్మకాన్ని సంపాదించటం... ఈ స్థానిక రుచుల కీర్తికి అసలు సిసలు కారణాలు. ఒక ప్రాంతానికి తీపి ఇష్టం. ఒక ఊరికి కారం అభిమానం. మరో ఊళ్లో తాండ్ర ప్రసిద్ధి. ఇంకో ఊళ్లో హల్వా అదిరిపోద్ది. ఆ ఊరే ఒక బ్రాండులా మార్మోగిపోతుంది. అది మనుషులు తమ శ్రమ ద్వారా, శ్రద్ధ ద్వారా సాధించిన విజయం. మనుషుల మనుసులను గెలిచిన వైనానికి నిదర్శనం. ఒక ప్రాంతపు రుచి, అభిరుచులూ ఏమిటో తెలియటానికి; తిండి పట్ల శ్రద్ధాసక్తులు అర్థం కావటానికి జనాదరణ పొందిన వంటకాలు ఆలంబనగా నిలుస్తాయి. అంటే- ఇకనుంచి ఆహారంలోని రుచిలోకే కాదు; చరిత్రలోకి, సంస్క ృతిలోకి కూడా తొంగిచూడండి!

- ఘాటు కారానికి గుంటూరు పేరు. ఆహారంలో కారం రుచి తగలాలంటే కృష్ణా, గుంటూరు జిల్లాల పచ్చళ్ళు, రకరకాల నాన్‌వెజ్ వంటకాలూ రుచి చూడాల్సిందే!
- చేపలతో తయారుచేసే పులుసులు, ఫ్రై వంటకాలకు నెల్లూరుతో పాటు కృష్ణా, గోదారి జిల్లాలు ప్రసిద్ధి.
- రకరకాల తీపి రుచులతో ఉభయ గోదావరి జిల్లాల్లోని ఆత్రేయపురం, తాపేశ్వరం, కాకినాడ, నిడదవోలులాంటి పట్టణాలు పేరుగడించాయి.
- రాయలసీమ రాగిముద్ద, జొన్న రొట్టెలు, కడప ఉగ్గాణీ బజ్జీలు, ధరణి కోట పొట్టేలు మాంసంతో తయారుచేసే వంటకాలు...