రాయలసీమ - వగ్గాని బజ్జీ బొరుగులు (మరమరాలతో చేసే టిఫిన్) సీమ ప్రత్యేకత. వీటిలోకి బజ్జీలు నంజుకొని తింటే ఉంటుంది ... ఆహా..ఒహో!ఒక్క చిత్తూరు జిల్లా మినహా, మిగతా మూడు జిల్లాల లో దీనిని చేస్తారు. ఇది హోటళ్ళ లో కూడా లభ్యం. అయితే ఒక్కో జిల్లాలో దీనికి ఒక్కో పేరు ఉంది. కర్నూలు లో బొరుగుల తిరగవాతగా, అనంతపురంలో ఉగ్గాని గా, కడప లో బొరుగుల చిత్రాన్నం గా పిలుస్తారు.
రాయలసీమ - బనగానెపల్లె బనగానెపల్లె 'బేనిషా' మామిడి పళ్ళు రాష్ట్రం మొత్తం పేరొందింది. మామిడి పళ్ళను ఇష్టపడే నవాబు, ఒక్కొక్క రకం మామిడి చెట్టుకి ఒక్కొక్క రకం గుర్తు (నిషాన్) చెక్కించేవాడు. అయితే ఒక రకం మామిడి పండు ఎంతో తీయగా, మిగతా అన్ని రకాల కంటే రుచిగా ఉండటంతో, ఆ చెట్టుకి ఏ గుర్తు చెక్కించక, దానికి గుర్తు లేనిది (బే నిషాన్) అని నామకరణం చేయించాడు. అదే వాడుకలో బేనిషా అయ్యింది..