అన్నం, పరబ్రహ్మ స్వరూపం అనే తెలుగు నానుడి. తెలుగింటి వంటలోని ప్రధాన ఆహార వస్తువు ఏమిటో చెప్పకనే చెబుతుంది! ఆంధ్ర ప్రదేశ్ కే ప్రత్యేకం కాకుండా తెలుగు వారు నివసించే అన్ని ప్రాంతాలలో తెలుగు వంటలు నోరూరిస్తుంటాయి. వంటలు తెలుగు వారికి ఇష్టమయిన కారం, పులుపు రుచుల మేళవింపుతో ఉంటాయి.
..
శాకాహారమయినా, మాంసాహారమయినా లేక చేపలు, రొయ్యలు, పీతలు ఇలా ఏ ఆహారమయినా అన్నిట్లోనూ వంటలు భేషుగ్గా ఉంటాయి. పప్పు లేనిదే ఆంధ్ర ఆహారం ఉండదు. అలానే టొమాటోలు మరియు చింతపండు వాడకమూ అధికమే! తెలుగు వంటకాలలో ప్రత్యేకత ను సంతరించుకున్నవి ఊరగాయలు. ఆవకాయ మొదలుకొని అన్ని రకాల కూరగాయలతో ఊరగాయ చేసుకోవడం తెలుగు వారికే చెల్లయింది. తెలంగాణ ప్రాంతంలో సజ్జ రొట్టెలని ఎక్కువగా తింటారు. కోస్తా, రాయలసీమ లలో అన్నం వినియోగం ఎక్కువ.
.
.
..
ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కడ ఏమి తినాలి ?
.
.
..
కోస్తాంధ్ర కృష్ణ మరియు గోదావరి పరివాహక ప్రాంతము మరియు బంగాళాఖాతాన్ని ఆనుకొన్న ప్రదేశం అవ్వటం మూలాన ఈ ప్రదేశం లో వరి, ఎండుమిరప లు పండుతాయి. అందుకే అన్నం, పప్పు మరియు సముద్రాహారాలు ఇక్కడి ప్రజల ప్రధానాహారం. ఇతర ప్రాంతీయ వంటకాలున్ననూ అన్నం మాత్రం ప్రధానాహారం.ఇక్కడి వంటకాలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా, తెలంగాణ, బెంగుళూరు, చెన్నై మరియు న్యూఢిల్లీ లలో కూడా ప్రశస్తి పొందాయి.
.
సంపూర్ణ తెలుగింటి భోజనం - శాకాహారములలో సంపూర్ణ ఆంధ్ర భోజనములో సహజంగా కలిగి ఉండేవి అన్నము, పప్పు, సాంబారు, రసం, ఊరగాయ, పులిహోర, అప్పడం మరియు వడియములు, ఒక కర్రీ ( వంకాయకూర, బెండకాయ ఇగురు, దొండకాయ వేపుడు మరేదైనా కావచ్చు) చివరగా పెరుగు. . ఇంకొన్ని చోట్ల వీటితో పాటుగా కారంపొడి, మజ్జిగ పులుసు, మూనక్కాయల పులుసు కూడా వడ్డిస్తుంటారు
.
.
|| ఆంధ్రుల భోజనం ||
.
అన్నం తెల్లగా మల్లెపూవులా మెతుకు మెతుకు అంటుకోకుండా ఉండాలి.
అన్నంలోకి వేడి,వేడి కమ్మని నేయి, చక్కని ముద్ద పప్పు, లేహ్యాలు, చోష్యాలు
.
అంటే
.
పచ్చళ్ళు, పులుసులు, ముక్కల పులుసుని ‘దప్పళం’ అనికూడా అంటారు,
.
ఇంకా తోట కూర పులుసు,మజ్జిగ పులుసు, చారు.
(సాంబారు,రసం మనవి కావు) అందులోకి వడియాలు, అప్పడాలు.
.
కూరలు - వంకాయకూర తప్పని సరి, పనసపొట్టు కూర, తీయ గుమ్మడికూర, కంద, అరటి, పొట్ల, దొండ,దోస, కాకర,బచ్చలి,తోట కూరలు, బెండకాయ వేపుడు. ఆవకాయి,మాగాయి, గోంగూర, కొబ్బరి నూల పచ్చళ్ళు.
.
పొడులు- కంది పొడి, పెసరపొడి, పప్పుల పొడి, కారపు పొడి.
.
ఇంక పిండివంటలు –వీటిని భక్ష్యాలు అంటారు.
.
ఇవి కారం - వడలు, ఆవడలు, పెరుగువడలు, జంతికలు,పప్పు చెక్కలు, చేగోణి(డి)లు.
.
ఇక మధురం - అతిరసాలు (అరిసెలు) బొబ్బట్లు, పూర్ణాలు, (వీటిని బూరెలు అనికూడా అంటారు)
.
సొజ్జేఅప్పాలు, అప్పాలు, లడ్లు (వీటిని మోదకాలు అంటారు) మినప సున్ని ఉండలు, కొబ్బరి ఉండలు, కజ్జికాయలు మొ//
.
అన్నంతో చేసేవి -- క్షీరాన్నం, లేక పాయసం( పయః అంటే పాలు)
.
పుళిహోర, – (పుళి అనగా చింత పండు, హోర అనగా అన్నం) దీనినే చిత్రాన్నం అంటారు.
.
దధ్యోదనం, (దధి=పెరుగు. ఓదనం=అన్నం.)
.
వెన్ పొంగలి, (తెల్లని ) దీనిని పులగం అని కూడా అంటారు.
.