జరుగుబాటు, చెల్లుబాటు ఉన్న చోట సాంప్రదాయాలు, ప్రత్యేకతలూ అందరి ఆమోదాన్ని ఆపాదించుకుంటాయి. జనరంజకంగా మారతాయి. గోదావరి జిల్లాల్లో దాదాపు ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేక వంటకం ఉంటుంది. వాటికి ఆదరణ చెక్కు చెదరదు. ఆత్రేయపురం పూతరేకులు; కాకినాడ, తాపేశ్వరం కాజాలు; పెద్దాపురం కోవా, చెక్కవడ; భీమవరం నాన్‌వెజ్ పచ్చళ్లూ, అంబాజీపేట పొట్టిక్కలు, అమలాపురం సోంపాపిడి, గొల్లల మామిడాడ ఇమిర్తి, పెరుమళ్లాపురం పాకం గారెలు, పాలకొల్లు దిబ్బరొట్టెలు, పెరవలి పచ్చళ్లు, పెనుగొండ కజ్జికాయలు ... ప్రసిద్ధి. ఇవి జిల్లాలోనే కాదు; ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో ఉన్న గోదావరి వాసులను కూడా నోరూరిస్తూ ఉంటాయి.