అన్నం, పరబ్రహ్మ స్వరూపం అనే తెలుగు నానుడి, తెలుగింటి వంటలోని ప్రధాన ఆహార వస్తువు ఏమిటో చెప్పకనే చెబుతుంది! తెలుగు వంట తెలుగు వారి ఇంటి వంట..
దానాలలో శ్రేష్టమైనది అన్నాదానం.
ఇవి ఆహారానికి ఉన్న ప్రాదాన్యాన్ని సూచిస్తున్నాయి. పుట్టుక నుండి మరణం వరకు ఆచరించే ప్రతి ఆచారంలోను భోజనానికి ప్రాదాన్యత ఉంది. సంతోష సమయాలలోనే కాక మరణం లాంటి విషాద సమయంలోను విచ్చేసిన బందు మిత్రులకు భోజనం అందించడం విద్యుక్తుదర్మాలలో ఒకటి.
ఆహారంలో అనేక అంశాలున్నాయి. వాటిలో ఒక సులభమైనది మీ ఆహారంలో ఏ రుతువులో వచ్చే ఆహారాలు ఆ రుతువులలో ఆహారంగా చేర్చుకోవడం.